నెల్లూరు జిల్లా లో పొదలకూరు మండలం పొదలకూరు అక్షాంశరేఖాంశాలు: 14.3667°N 79.7333°E రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ జిల్లా నెల్లూరు మండల కేంద్రము పొదలకూరు గ్రామాలు 36 పొదలకూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 345., ఎస్.టి.డి.కోడ్ = 08621. నెల్లూరు నుంచి నెల్లూరు 29 కీ.మీ, సైదాపురం 25 కీ.మీ, రాపురు 30 కీ.మీ, కలువాయి 40 కీ.మీ. సంగం నుంచి 25 కి.మి. దేవాలయాలు శ్రీ కామాక్షీతాయి సమేత తామలింగేశ్వరస్వామివారి దేవాలయం:- 16వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయంలో, మహాశివరాత్రి ఉత్సవాలు, శివరాత్రి ముందురోజున ప్రారంభమగును. ఆ రోజు అంకురార్పణ, ధ్వజారోహణ, రావణసేవతో కార్యక్రమాలు మొదలగును. శివరాత్రి రోజు నందిసేవ, మహాశివరాత్రి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించెదరు.పొదలకూరు పట్టణం నడిబొడ్డున ఉన్న రామమందిరం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలు ఉన్నవి. శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- పొదలకూరు మారుతినగరులో వెలసిన ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి వేడుకలు (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. పొదలకూరులోని శివాలయం వీధిలో ఒకే ప్రాంగణంలో శివాలయం, వెంకయ్యస్వామి ఆలయం, అయ్యప్పస్వామి ఆలయం, పోలేరమ్మ ఆలయం, సిద్ధేశ్వరస్వామి ఆలయం ఉండటంతో ఆధ్యాత్మికత ఉట్టిపడుచున్నది. గ్రామాలు ఆల్తుర్తి, అంకుపల్లె, అయ్యగారిపాలెం, బత్తులపల్లె, బత్తులపల్లిపాడు, భోగసముద్రం, బిరడవోలు, బ్రాహ్మణపల్లి(పొదలకూరు), చెర్లొపల్లి.బి, చాటగొట్ల, డేగపూడి, డేగపూడి రాజుపాలెం, దుగ్గుంట, కొనగలూరు, దుగ్గుంట, రాజుపాలెం, గురవాయపాలెం, ఇనుకుర్తి, కనుపర్తి, మహమ్మదపురం, మర్రిపల్లె ,గోపసముద్రం, మరుపూరు, మొగల్లూరు, నల్లపాలెం, నందివోయ, నావూరు, నావూరు పల్లి, నేదురుపల్లె, పార్లపల్లె, ప్రభగిరిపట్నం, పులికొల్లు, రేవల్ల, యెరుగుంటపాలెం, సూరయపాలెం, తాటిపర్తి, తోడేరు, ఉసపల్లె, ఉట్లపాలెం, వావింటపర్తి, వెలిగంటిపాలెం, వీరూరు, చిట్టేపల్లి, చెన్నారెడ్డిపల్లె(పొదలకూరు)
No comments:
Post a Comment